calender_icon.png 30 September, 2024 | 12:52 PM

పంచాయతీరాజ్ శాఖలో ఏఈల కొరత!

30-09-2024 01:14:14 AM

కామారెడ్డి జిల్లాలో 54 మందికి 13 మందితోనే పనుల నిర్వహణ

ఒక్కో అధికారికి మూడు మండలాల బాధ్యతలు

కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): అభివృద్ధి పనుల్లో అధిక ప్రాధాన్యత పంచాయతీరాజ్ శాఖదే. కానీ ఆ శాఖలో అవసరమైన సంఖ్యలో ఇంజనీర్లు లేక అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కామారెడ్డి జిల్లాలో 54 మంది అవసరం ఉండగా కేవలం 13 మందితోనే నెట్టుకొస్తున్నారు.

ఒక్కో అధికారికి రెండు, మూడు మండలాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో క్షేత్రస్థాయిలో చేపడుతున్న ప్రగతి పనులపై పర్యవేక్షణ లోపిస్తున్నది. ఫలితంగా అభివృద్ధి పనులు మందకొండిగా జరుగుతున్నా యి.

పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం సబ్ డివిజన్‌లను పెంచినప్పటికీ అవసరమైన అధికారులను నియమించకపోవడంతో ఆ శాఖ వ్యవహారాలు పూర్తిగా గాడి తప్పుతున్నాయనే అభిప్రాయం వస్తున్నది. జిల్లాలోని రెండు డివిజన్లలో ఖాళీ లను అనుగుణంగా నియామకాలు చేపట్టవల్సి ఉంది. 

ఉన్నవారిపై అదనపు భారం

ఇటీవల ప్రభుత్వం రెండు పడక గదుల సర్వే, ఇతర పనులను పంచాయతీ రాజ్‌శాఖకు అప్పగించింది. దీంతో వారు శాఖపర మైన పనులు పక్కన పెడుతున్నారు. పురపాలక సంఘాల్లో చేపడుతున్న ప్రగతి పనుల పర్యవేక్షణ బాధ్యతలను సైతం పీఆర్ ఇంజనీర్లకే అప్పగిస్తుడటం  మరింత ఇబ్బందికర ంగా మారింది.

నిబంధనల ప్రకారం మున్సిపల్  శాఖకు చెందిన ఇంజనీర్ల ఆధ్వర్యంలో నే బల్దియా పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా జిల్లాలోని మూడు ము న్సిపాలిటీలు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో  పీఆర్ ఇంజనీర్ల ఆధ్వర్యం లో అంచనాలు రూపొందించడంతో పాటు బిల్లులు చేయడం జరుగుతున్నది. 

జిల్లాలో ఖాళీలు ఇలా..

జిల్లా వ్యాప్తంగా మొత్తం 54 ఇంజనీరింగ్ పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 13 మంది మాత్రమే ఉన్నారు. ఇటీవల జ రిగిన బదిలీలలో జిల్లా నుంచి పెద్ద ఎత్తు న ఇంజనీర్లకు స్థానచలనం కదిలింది. వా రి స్థానాల్లో ఇతరులను నియమించలేదు. జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ డివిజన్లు ఉన్నాయి.

ఒక డివిజన్ పరిధిలో నాలుగే సి సబ్ డివిజన్లు ఉన్నాయి. కామారెడ్డి డి విజన్‌లో 24మంది మాత్రమే విధులు ని ర్వహిస్తున్నారు. 17 ఇంజనీరింగ్ పోస్టులు  ఖాళీగా ఉన్నాయి. బాన్సువాడ డివిజన్‌లో  29 ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా కాగా కేవలం ఐదుగురు మాత్రమే విధు లు నిర్వహిస్తున్నారు.

24 పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. సబ్ డివిజన్లకు డీఈలు ఉన్నప్పటికీ కామారెడ్డి ఈఈ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆర్మూర్ డీఈకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్లకు కార్యాలయంతో పాటు మూ డు నుంచి 4 మం డలాల బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు ఏ మండలానికి వెళ్లలేక కార్యాలయానికే పరిమిత మవుతున్నారు. 

ప్రభుత్వానికి  నివేదించాం

జిల్లాలో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్టుల గురించి ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే ఇంజనీర్లను నియమించే అవకాశం ఉంది. ప్రగతి పనులను ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించి పనులు చేస్తున్నాం.

 బావన్న, ఇన్‌చార్జి ఈఈ, పీఆర్, కామారెడ్డి