calender_icon.png 16 January, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్డీవో ఆఫీసులో షార్ట్ సర్యూట్

12-07-2024 12:17:48 AM

విలువైన భూసేకరణ రికార్డులు దగ్దం

జయశంకర్ భూపాలపల్లి, జూలై 11(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్యూట్ జరిగింది. గురువారం కార్యాలయం తెరిచి చూసిన సిబ్బంది ప్రమాదం జరిగిన ట్టు గుర్తించారు. ఈ ఘటనపై గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆర్డీ వో కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ప్రమాదంలో కార్యాలయంలోని బీరువాలో భద్రపర్చిన విలు వైన సుమారు 15 భూసేకరణ రికార్డులు దగ్ధమైనట్లు అధికారులు చెప్తున్నారు. దగ్ధమైన పత్రాల్లో కాళేశ్వరం, మేడిగడ్డ, సింగరేణి, కేటీపీ పీలో భూములకు చెల్లించే విలువైన రికార్డులు ఉన్నట్టు సమాచారం.