calender_icon.png 6 January, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లఘు చిత్ర పోటీల అవార్డుల ప్రదానోత్సవం

04-01-2025 02:39:33 AM

కరీంనగర్, జనవరి3 (విజయక్రాంతి): కరీంనగర్ ఫిలిం సొసైటీ, తెలంగాణ లఘు చిత్రాల నిర్మాతల మండలి సంయుక్తంగా తెలంగాణ రాష్ర్ట భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించిన మానేటి లఘు చిత్ర పోటీలు 2024 అవార్డుల ప్రధానో త్సవ కార్యక్రమాన్ని జనవరి న సాయంత్రం 5.00 గంటలకు ఫిలిం భవన్ లో ఏర్పాటు చేసినట్లు ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, ఫెస్టివల్ కోఆర్డినేటర్ కె లక్ష్మీ గౌతమ్‌లు  తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డాక్టర్ జి. వెన్నెల హాజర వుతున్నారని తెలిపారు. సాంస్కృతిక సారధి చైర్ పర్సన్‌గా నియమితులైన తర్వాత మొద టిసారిగా వెన్నెల కరీంనగర్ కు వస్తున్నట్లు తెలియజేశారు. విశిష్ట అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ప్రత్యేక అతిథులుగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ,  రాష్ర్ట మహాత్మ జ్యోతిబాపూలే విద్యాసంస్థల జాయింట్ సెక్రెటరీ శ్యాం ప్రసాద్ లాల్ హాజరవుతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ లఘు చిత్ర నిర్మా తల మండలి అధ్యక్షులు  తంగడ అశోక్ రావు,  జ్యూరీ సభ్యులు అక్షర కుమార్,  కే మల్లారెడ్డి,  పి ఎస్ రవీంద్రలు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ల ఘు చిత్ర నిర్మాతలు,  దర్శకులు నటులు కళాకారులు కవులు రచయితలు అధిక సం ఖ్యలో హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.