సిద్దిపేట అర్బన్, జనవరి 31 : సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో బాకీ బిక్షప తి, బాకీ లక్ష్మీ లకుచెందిన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమై పోయింది. విషయం తెలుసుకున్న కాంగ్రె స్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షు లు అత్తు ఇమామ్ లు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.
బాధిత కుటుం బాలను పరామర్శించి రూ.20వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భం గా హరికృష్ణ, అత్తూ ఇమామ్ మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన బాధిత కుటుం బానికి అండగా ఉంటామని తెలిపారు. విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తామన్నారు.
కుటుంబాన్ని ఆదుకోవడా నికి దాతాలు సహాయం అందిస్తే బాగుం టుందని కోరారు. నిరుపేద కుటుంబం కష్టం మీద ఆధారపడ్డ కుటుంబం ఉన్న ఇల్లు దగ్ధం కావడంతో రోడ్డున పడింద న్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫయా జుద్దీన్, గయాజుద్దీన్, నజ్జు, కవిత, శంకర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.