స్వల్పంగా తగ్గిన సెన్సెక్స్
ముంబై, సెప్టెంబర్ 3: వరుస రికార్డులతో అదరగొట్టిన దేశీయ ప్రధాన సూచి బీఎస్ ఈ సెన్సెక్స్ అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో మంగళవారం చిన్న బ్రేక్ తీసుకుంది. 10 రోజుల పాటు వరుసగా పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ రోజంతా స్వల్పశ్రేణిలో కదలా డింది. తుదకు 4.40 పాయింటు కోల్పోయి 82,555 పాయింట్ల వద్ద నిలిచింది. ఈ సూచి ఇంట్రాడేలో 159 పాయింట్లు తగ్గి 82,400 పాయింట్ల వద్ద కనిష్ఠస్థాయిని నమోదు చేసింది. గత 10 ట్రేడింగ్ సెషన్ల లో సెన్సెక్స్ 2,100 పాయింట్లు ర్యాలీ చేసింది.
మరో ప్రధాన సూచి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మాత్రం వరుసగా 14వ రోజూ లాభపడింది. ఈ సూచి 1.15 పాయింట్ల లాభంతో 25,279.85 పాయింట్ల కొత్త రికార్డుస్థాయివద్ద ముగిసింది. నిఫ్టీ 14 రోజుల్లో 1,141 పాయింట్లు ర్యాలీ జరిపింది. ఒకవైపు మెట ల్, ఆయిల్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ, మరోవైపు ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని ట్రేడర్లు తెలిపారు.
ప్రతికూల గ్లోబల్ సంకేతాలు
ఫెడ్ రేట్ల కోత మినహా మార్కెట్‌ను పరు గు పెట్టించే కొత్త చోదకాలు లేకపోవడంతో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నాయని, దీనితో దేశీయ సూచీల జోరుకు బ్రేక్ పడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఇటీవల వివిధ దేశాల్లో డిమాండ్ తగ్గి, తయారీ కార్యకలాపాలు మందగించడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారని తెలిపారు. ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలు నష్టాలతో ముగిసాయి. యూరప్ మార్కెట్లు సైతం నెగిటివ్‌గా ట్రేడయ్యాయి. వరుస ర్యాలీల కారణంగా మరిన్ని బుల్లిష్ పొజిషన్లు తీసుకోవడానికి ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారని మెహతా ఈక్విటీస్ సీనియ ర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు.
3 రోజుల్లో రూ.10,300 కోట్లు
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
కొద్ది రోజులపాటు వరుస విక్రయాల కు పాల్పడిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట ర్లు (ఎఫ్‌పీఐలు) తిరిగి పెద్ద ఎత్తున భారత్ మార్కెట్లో నిధులు కుమ్మరిస్తున్నారు. వరుసగా వీరు 3 రోజుల్లో రూ.10,300 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగో లు చేశారు. గత గురువారం రూ.3,260 కోట్లు, శుక్రవారం రూ.5,318 కోట్లు, సోమవారం రూ.1,735 కోట్లు పెట్టుబడి చేసినట్టు స్టాక్ ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఐసీఐసీఐ బ్యాంక్ 1.5 శాతం పెరిగింది. బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 1 శాతం వరకూ లాభపడ్డాయి. మరోవైపు బజాజ్ ఫైనా న్స్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డ బ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, భారతి ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు 1.5 శాతం వరకూ నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నిం టికంటే అధికంగా యుటిలిటీస్ ఇండెక్స్ 0.77 శాతం తగ్గింది.
ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.69 శాతం తగ్గింది. రియల్టీ ఇండెక్స్ 0.53 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 0.51 శాతం, ఐటీ ఇండెక్స్ 0.31 శాతం చొప్పున తగ్గాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్స్, బ్యాంకెక్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, సర్వీసెస్ ఇండెక్స్‌లు పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.54 శాతం చొప్పున లాభపడ్డాయి.