calender_icon.png 11 February, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ లో దుకాణాలు తరలింపు

11-02-2025 01:50:10 PM

కోర్టు తీర్పు అమలు చేస్తున్న పోలీసులు 

ఎల్బీనగర్,(విజయక్రాంతి): సరూర్ నగర్(Saroor Nagar)లోని హుడా కాంప్లెక్స్(HUDA Complex) శిథిలావస్థకు చేరడంతో భవనాన్ని కూల్చి వేయాలని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పు మేరకు సరూర్ నగర్ పోలీసులు హుడా కాంప్లెక్స్ లోని దుకాణదారులను ఖాళీ చేయిస్తున్నారు. హెచ్ఎండీఏ అధికారులు, సరూర్ నగర్ పోలీసులు దగ్గర ఉండి దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు  చేశారు.