calender_icon.png 22 January, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ సర్క్యూట్తో చిరు వ్యాపారుల షాపులు దగ్ధం

16-07-2024 03:12:10 PM

హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ఆగ్ని ప్రమాదం జరిగింది. పాపారావు బొందలో చిరు వ్యాపారాలు చేసుకునే పండ్ల బండ్లకు సోమవారం రాత్రి నిప్పు అంటుకుంది. భారీగా వర్షం కురుస్తుండగానే పండ్ల బండ్లకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే ఈ అగ్నిప్రమాదం జరిగిందా? లేదా ఎవరైనా కావాలని నిప్పంటించారా! అనేది తెలియడంలేదు.

ఒకేసారి అన్ని పండ్ల బండ్లకు మంటలు చేలరేగి పూర్తిస్థాయిలో ఖాళీ బూడిద కావడం పట్టణంలో సంచలనం కలిగించింది.నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు పండ్లు అమ్ముకుని వచ్చిన డబ్బులను అక్కడే దాచుకునే చిరు వ్యాపారుల పండ్లు నగదు పెద్ద మొత్తంలో దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.

ఏది ఏమైనాప్పటికీ వర్షం పడుతుండగానే నిప్పురవ్వలు చెలరేగి పెద్ద ఎత్తున మంటలు లేవడం పలువురిని ఆలోచింపజేస్తుంది. ఫైర్ సిబ్బంది యువకులు మంటలు ఆర్పినప్పటికీ బండ్లు మొత్తం ఖాళీ బూడిద అయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారుగా 20 లక్షల నష్టం, 15 కుటుంబాలు రోడ్డున పడ్డినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రణవ్ బాబు కార్యకర్తలతో కలిసి సహాయ సహకారాలు అందించాలని కోరారు. వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.