బెల్లంపల్లి,(విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కన్నాల శ్రీబుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మూడు రోజులపాటు జాతర జరుగనుంది. జాతరలో ఏర్పాటు చేసే దుకాణాల వేలం పాటను ఈ నెల 30న ఉదయం 11 గంటలకు దేవాలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు ఎండోమెంట్ అధికారి బాపిరెడ్డి తెలిపారు. కొబ్బరికాయల అమ్మకం, ప్రసాదం అమ్మకం, వాహనాల పార్కింగ్, దుకాణాల తైబజారు కోసం నిర్వహించే వేలం పాటలో పాల్గొనే వారు ముందుగా రూ 20 వేలు డిపాజిట్ చెల్లించాలని తెలిపారు.