02-04-2025 12:59:36 AM
22 ఏళ్లుగా ఆస్తిపన్ను చెల్లించని వైనం
కరీంనగర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): రెవిన్యూ క్లబ్ బాద్యులు 22 ఏళ్లుగా కరీంనగర్ నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను బకా యిలు చెల్లించకపోవడంతో రెవెన్యూ క్లబ్ కు చెందిన 36 దుకాణాలను సీజ్ చేశారు. తొలుత రెవిన్యూ క్లబ్, రెవిన్యూ గార్డెన్ లకు తాళాలు వేసి నగరపాలక సంస్థ వారు నోటీసులు అందించి మార్చి31 లోగా 90 శాతం వడ్డీ రాయతి తో చెల్లించాలని సూచించారు.
మొత్తం 86 లక్షల బకాయి ఉండటంతో గడువు దాటినా చెల్లించ లేదు. సోమవారం 36 దుకాణాలను సీజ్ చేసి రాత్రి 12 గంటలవరకు సమయం ఇచ్చిన స్పందించక పోవడంతో సీజ్ చేశారు. కలెక్టరేట్ ముందు డి టి పి, జిరాక్స్,, మీ సేవా, దస్తా వెజిలు లాంటి వ్యాపారాలలో జీవనం సాగిస్తున్న చిరువ్యాపారులు రోడ్డున పడ్డారు.
క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యం
కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా రెవెన్యూ ఉస్యోగుల రిక్రియేషన్ క్లబ్ 36 దుకాణాల సముదాయాన్ని నిర్మించింది.ఓపెన్ యాక్షన్ క్రింద వీటిని లీజుకి ఇచ్చారు. 22 ఏళ్ళు గా లీజు దారులు క్రమం తప్పకుండా నెలసరి అద్దెని చెల్లిస్తున్నారు. అయితే ఆస్తి పన్ను చెల్లింపులో రెవెన్యూ క్లబ్ నిర్లక్ష్యం వహించడతో నేడు ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక్కో దుకాణం 2లక్షల 216 చొప్పున 22 ఏళ్ల బకాయిలు పడ్డాయి. అద్దె చెల్లిస్తున్న బకాయిలు పేరుకు పోబడంతో రెవెన్యూ క్లబ్ నిర్వహకులు అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు వస్తిన్నాయి.
రొడ్డున పడ్డ సబ్ లీజ్ దారులు
------రెవెన్యూ క్లబ్ దుకాణాల సముదాయంలో ఒకరిద్దరు మినహా అందరూ సబ్ లీజుదారులే ఉన్నారు. లీజు దారులు రెవెన్యూ క్లబ్ వారికి నెలకి 7000 చొప్పిన అద్దె చెల్లిస్తిన్నారు. లీజు దారులు సబ్ లీజ్ దారులనుండీ ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. తాజా పరిణామాల వల్ల సబ్ లీజ్ దారులు రోడ్డున పడ్డారు. మంగళవారం సమావేశమై రెవెన్యూ అధికారులకు మోర పెట్టుకున్నారు. రెవెన్యూ క్లబ్ కు చైర్మన్ గా కలెక్టర్ లు వ్యవహరిస్తారు. నిర్వహణ కార్యదర్శి చేతిలో ఉంటుంది. బకాయిలు పేరుకు పోవడం పై కలెక్టర్ ఆరా ఠీస్తున్నట్టు తెలసింది.