ఎన్టీఆర్ నీల్ కాంబో చిత్రం ఎప్పు డు ప్రారంభమవుతుందా? అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. డ్రాగన్ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుందట. ఇప్పటికే లొకేషన్స్ కూడా ఫైనల్ చేశారట. కర్ణాటకలో మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించ బోయే కీలక నటులను సైతం ఖరారు చేశారని సమాచారం.
ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో మూవీ థీమ్ తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ మూవీ డ్రగ్ మాఫియాతో పాటు కొకైన్, గంజాయి స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ చిత్రంలో మలయాళంలో ప్రముఖ నటులైన బీజూ జోనన్, టోవిన్ థామస్‌ని ఎంచుకున్నారట. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను తీసుకుం టారంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు ఫిక్స్ అయిన ట్టుగా తెలుస్తోం ది. మొత్తానికి సంక్రాంతికి చిత్రం ప్రారంభం కానుందని సమాచారం.