హీరో రవితేజ, మాస్ డైరెక్టర్ హరీశ్‌శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా అయాంక బోస్ పని చేస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. ఈ నెల 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలను పెంచేలా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూట్ పూర్తయింది. ఈ విషయాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ సామాజిక మాధ్యమాల వేదికగా సోమవారం ప్రకటించారు.