calender_icon.png 26 October, 2024 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లండన్‌లో షూటింగ్

24-10-2024 12:35:03 AM

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీతో సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మై3 ఆర్ట్స్ బ్యానర్లపై లండన్ గణేశ్, డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి వూట్ల నిర్మిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఫిల్మ్స్ లిమిటెడ్ లైన్ ప్రొడక్షన్‌ను నిర్వహిస్తున్న ఈ సినిమాను లండన్‌లో అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు.

షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. డీఆర్‌కే కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ కాగా, రియల్ సతీశ్ స్టంట్ డైరెక్టర్. అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి, వైవా హర్ష, వెన్నెల కిషోర్, ఎస్ నివాసిని, షకలక శంకర్, మహేంద్ర, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ త్వరలోనే విడుదల చేయనున్నారు.