calender_icon.png 12 October, 2024 | 12:57 AM

జనవరిలో షూటింగ్

10-10-2024 12:00:00 AM

రాజమౌళి-మహేశ్‌బాబు చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ‘ఎస్‌ఎస్‌ఎంబీ౨9’గా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కానుందనే గుట్టు విప్పారు.

మహేశ్-రాజమౌళి సినిమా జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. ఈ కథ రాయడానికి తనకు రెండేళ్ల సమయం పట్టిందన్నారు. సినిమా జనవరిలో ప్రారంభం కానుందని తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.