మెక్సికో సిటీ, జనవరి 6: మెక్సికోలోని ఓ బార్‌లోకి గుర్తుతెలియని వ్యక్తు లు తుపాకులతో ప్రవేశించి కా ల్పులు జరిపారు. కాల్పుల్లో ఐదుగురు పౌరులు అక్కడికక్కడే మృతిచెం దగా, మరో ఏడుగురు తీవ్రగాయాల పాలయ్యారు. టబాస్కో రాష్ట్రం విల్లాహెర్మోసాలోని ‘బార్ లా కాసిటా అజుల్’ బార్‌లోకి శనివారం రాత్రి కొందరు దుండగులు సాయుధంగా ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పు లు జరిపారు.
కాల్పుల్లో ఐదుగురు పౌరులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి వైద్యం చేయిస్తున్నారు. విల్లాహర్మోసా నగరంలో నవంబర్‌లోనూ ఇదే తరహా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో పది మంది పౌరులు మృతిచెందారు. ఆ ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడంపై నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. భద్రత దళాలు నిందితులను అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించాయి.