calender_icon.png 2 April, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షూటింగ్ షురూ

25-03-2025 12:00:00 AM

వరుణ్‌తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘వీటీ15’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా ఎంపికైంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రూపొందుతున్న వరుణ్‌తేజ్ కెరీర్‌లో ఒక ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా మారుతుందని చిత్రబృందం చెబుతోంది.

అయితే, తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా సోమవారమే హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు థమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.