calender_icon.png 3 March, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనివర్సిటీలో కాల్పులు

02-03-2025 12:24:14 AM

  1. విద్యార్థి మృతి
  2. అలీగఢ్ యూనివర్సిటీలో ఘటన

అలీగఢ్, మార్చి 1: అలీగఢ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగి.. ఓ విద్యార్థి మరో విద్యార్థిని తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో రెండో విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని మహ్మద్ కైఫ్‌గా గుర్తించారు. ఈ ఘటన తర్వాత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులు దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.