calender_icon.png 19 April, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు

18-04-2025 11:12:33 PM

దుర్ఘటనలో ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

విచారం వ్యక్తం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలోని తలహసీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురుకి గాయాలయ్యాయి. పోలీసులు దుండగుడిని పట్టుకున్నట్టు సమాచారం. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తలహసీ మెమోరియల్ హెల్త్‌కేర్ ప్రతినిధి వెల్లడించారు. కాల్పుల ఘటనతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తలహసీ క్యాంపస్‌లోని స్టూడెంట్ యూనియన్‌లో యాక్టివ్ షూటర్ ఉన్నట్టు తొలుత సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించింది. అనంతరం పోలీసులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో క్యాంపస్ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. అధికారులు అధ్యక్షుడు ట్రంప్‌నకు విషయాన్ని చేరవేశారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదొక భయంకర ఘటన వ్యాఖ్యానించారు.