పారిస్: పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటర్ మను బాకర్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం వచ్చింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మహిళ మను బాకర్ ఫైనల్ కు చేరుకున్నారు. క్వాలిఫైయింగ్ రౌండ్ లో మను బాకర్ 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. దీంతో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మను బాకర్ 221.7 పాయింట్లు సాధించి కాంస్యం గెలుచుకుంది. ఇద్దరు దక్షిణ కొరియన్లు స్వర్ణం, రజతం సొంతం చేసుకున్నారు. ఓయె జిన్ 243.2 పాయింట్లుతో స్వర్ణం కొట్టాగా, కిమ్ యెజి 241.3 పాయింట్లుకి రజతం సాధించారు.