ఎన్నికల ప్రచారంలో ఉండగా హత్యాయత్నం
తృటిలో తప్పించుకొన్న అమెరికా మాజీ అధ్యక్షుడు
కాల్పులు జరిపిన వ్యక్తిని
మట్టుబెట్టిన పోలీసులు
ట్రంప్ చెవికి గాయం.. అయినా వెరువక గర్జన
సమీపంలోని భవనం నుంచి కాల్పులు
చెవి నుంచి దూసుకుపోయిన బుల్లెట్
దుండగుడిని గుర్తించి హతమార్చిన భద్రతా బలగాలు
దాడిని ఖండించిన అమెరికా సహా ప్రపంచ నేతలు
వాషింగ్టన్, జూలై 14: అమెరికాలో మళ్లీ తుపాకి పేలింది.. ఈసారి అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నవేళ.. అమెరికా ఉలిక్కిపడే ఘటన జరిగింది.. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేలియాలోని బల్లర్‌లో అమెరికా కాల మానం ప్రకారం శనివారం ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతుండగా ఓ బుల్లెట్ దూసుకొచ్చి ఆయన కుడి చెవిని తాకుతూ వెళ్లింది. దీంతో గాయమై రక్తం కారింది.
ట్రంప్ వెంటనే కిందికి వంగటంతో పెనుప్రమాదం తప్పింది. ఆ వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్‌కు రక్షణగా చుట్టూ నిలబడి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. చెవికి గాయమైనా.. రక్తమోడుతున్నా వెరువకుండా ట్రంప్ పిడికిలెత్తి నినాదం చేయటం గమనార్హం. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తీవ్రంగా ఖండించారు. తన మిత్రుడు ట్రంప్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
అమెరికా, జూలై 14: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా అధ్యక్ష బరిలో ఉన్న అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం చేశారు. వెంట్రుకవాసిలో తప్పించుకోవడంతో ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డారు. దుండగుడు రైఫిల్‌తో ట్రంప్‌పై దాడి చేయగా ఆయన చెవికి తగలడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే ఆయన కిందికి పడిపోయారు. భద్రతా సిబ్బంది ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటన అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన ఆ దేశ చరిత్రంలో మచ్చగా మిగిలిపోనుంది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైంది. ప్రచారంలో పాల్గొన్న ఒకరు మరణించారని తెలుస్తోంది. ట్రంప్ పాల్గొన్న ప్రచారంలో పలుమార్లు తుపాకీ శబ్దం వినిపించింది. కాల్పుల శబ్దం రాగానే ఆయన వెంటే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను వేదికపై నుంచి దించి కారు వద్దకు తీసుకెళ్లారు. ఈ సమయంలో గాయపడిన ట్రంప్ తన అనుచరులను విజయం తమదేనంటూ ఉద్దేశించి పిడికిలి బిగించి అభివాదం చేశారు. తాను ఎప్పటికీ లొంగిపోనని నినాదం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం గాయపడిన ట్రంప్‌ను ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రంప్ చెవికి గాయమైంనది, ముఖానికి రక్తం అంటుకుందని వైద్యులు తెలిపారు.
దుండగుడు స్థానిక వ్యక్తే..
ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని అధికారులు తెలుసుకున్నారు. అతని పేరు థామస్ మాథ్యూ క్రూక్స్ (20)గా గుర్తించారు. మాథ్యూ బెతెల్ పార్క్ నివాసి అని, ఇది ట్రంప్ సమావేశానికి 40 మైళ్ల దూరంలో ఉందని తెలిపారు. అయితే, ఆ వ్యక్తి దాడికి ఎందుకు పాల్పడ్డాడు? అతని ఉద్దేశం ఏంటి? అనే విషయాలు ఇంకా తెలియలేదు. నివేదిక ప్రకారం నిందితుడు 130 గజాల దూరం నుంచి ఓ ఇంటి పైకప్పు నుంచి ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. అయితే బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లింది. అయినా ట్రంప్ ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిల్చోవడం గమనార్హం. కాగా, కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని క్షణాల్లోనే గుర్తించి అతన్ని కాల్చి చంపేశారు.
రిపబ్లికన్ అయినా.. డెమోక్రాట్లకు విరాళం
నిందితుడు క్రూక్స్ గతంలో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ 2021లో 15 డాలర్లను డెమోక్రాట్రకు విరాళంగా ఇచ్చాడు. ప్రస్తుతం క్రూక్స్ ఇంటి వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించాయి. ఆ మార్గంలోకి ఎవరినీ రానీయడంలేదు. క్రూక్స్ ఫొటోలు, వీడియోలు ముందుగానే సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా ఇతడే నేరస్థుడని కథనాలు ప్రసారం చేశాయి. కాల్పులకు ముందు అతను మాట్లాడిన ఓ వీడియో ప్రచారంలో ఉంది. అందులో రిపబ్లిక్ పార్టీనీ, ట్రంప్‌ను ద్వేషిస్తున్నట్లు అతను వ్యక్తపరిచాడు. ట్రంప్ ప్రసంగిస్తున్న వేదికకు 130 మీటర్ల దూరంలోని ఓ ఫ్యాక్టరీ పైకప్పు నుంచి మాటు వేసి కాల్పులకు తెగబడినట్లు కొన్ని వీడియోలు స్పష్టం చేస్తున్నాయి. దుండగుడి కాల్పుల తర్వాత అతన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అతనిపై కాల్పులు జరిపి మట్టుబెట్టింది.
ట్రంప్ బృందం మాకేం చెప్పలేదు
ట్రంప్‌పై కాల్పులు జరిగిన ప్రాంతాన్ని ఇంకా అనుమానిత స్థలంగానే గుర్తిస్తున్నట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రకటించింది. అక్కడ కొన్ని అనుమానిత ప్యాకేజీలు గుర్తించినట్లు ఎఫ్‌బీఐ తెలిపింది. అవన్నీ పేలుడు పదార్థాలుగానే భావించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు దుండగుడిని చంపేసినా అతని ఉద్దేశం ఏంటో ఎఫ్‌బీఐ కనిపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎవరికైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరింది. అందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది.
అదే సమయంలో అదనపు భద్రత కోసం ట్రంప్ కానీ ఆయన ప్రచార బృందం ఎలాంటి సూచనలు చేయలేదని తెలిపింది. కాల్పులు జరిగే వరకూ తమకు ఎలాంటి ఇంటెలిజెన్స్ సమాచారం రాలేదని తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామని, ఇందుకు కొన్ని నెలల సమయం పడుతుందని ఎఫ్‌బీఐ తెలిపింది. దుండగుడు ఆ ప్రాంతానికి ఎలా వచ్చాడు? ఏ ఆయుధం వాడాడు? ఇవన్నీ గుర్తించాల్సి ఉందని పేర్కొంది. అయితే, ఈ ఘటన ట్రంప్‌పై హత్యాయత్నంగానే భావిస్తున్నట్లు ఎఫ్‌బీఐ స్పష్టం చేసింది. ఈ ఘటనపై ప్రతినిధుల సభ చెందిన ఓ కమిటీకి సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీకి సమన్లు జారీ చేసింది. దీనిపై విచారణకు రావాలని ఆదేశించింది.
చైనాలో ట్రంప్ టీ షర్టులు
ట్రంప్‌పై దాడి నేపథ్యంలో చైనాలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కొందరు వ్యాపారులు ట్రంప్ టీషర్టులను రూపొందించి విక్రయాలు మొదలు పెట్టారు. ఈ టీషటర్టులో చైనాలోని అలీబాబా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. డిజిటల్ టెక్నాలజీతో వీటిని రూపొందించగా తమ వ్యాపారవృద్ధికి ఇది దోహదం చేస్తుందని భావించారు. ఘర్షణ మొదలైన తర్వాత మూడు గంటల్లోనే 2 వేలకుపైగా ఆర్డర్లు వచ్చినట్లు ఓ మహిళా వ్యాపారి వెల్లడించారు. ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం ఫైట్ ఫైట్ అంటూ ఆయన నినదించారు. ఈ స్లోగన్‌ను టీషర్టులపై ముంద్రించి గంటల్లోనే విక్రయానికి ఉంచడం గమనార్హం.
పక్కా ప్లాన్‌తో..
ట్రంప్‌పై ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లు అక్కడి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. దుండగుడు దాడి చేసేందుకు ఉపయోగించిన ఇంటికి ఎక్కేందుకు నిచ్చెన ఉంది. దీనికి తోడు ట్రంప్ నిలబడిన ప్రదేశం దుండగుడికి స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్‌పై క్రూక్స్ ఏఆర్ సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఆ ఆయుధాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
నమ్మలేక పోతున్నా..
ట్రంప్ స్పందిస్తూ.. కుడి చెవి పైభాగం నుంచి బుల్లె ట్ వెళ్లిందని తెలిపారు. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తన ప్రా ణాల్ని కాపాడారని వెల్లడిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు. కాల్పుల ఘటనపై వే గంగా స్పం దించినందుకు సీక్రెట్ సర్వీస్‌కు కృతజ్ఞతలు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, తీవ్రంగా గా యపడిన మరో వ్యక్తికి నా సానుభూతిని తెలియజేస్తున్నా. దాడి చేసిన వ్యక్తి ఎవరో ప్రస్తుతానికి నాకు తెలి యదు. నా కుడి చెవి పై నుంచి బుల్లెట్ వెళ్లింది. చాలా రక్తం పోయింది. గాడ్ బ్లెస్ అమెరికా అని పేర్కొన్నా రు. మృత్యువు నుంచి దేవుడే కాపాడినట్లు తెలిపారు.
హేయమైన దాడి..
ట్రంప్‌పై కాల్పుల ఘటనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి హింసాయుత ఘటననకు ప్రజాస్వామ్య దేశంలో తావు లేదన్నారు. తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు తావు లేదు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా
నరేంద్రమోదీ, భారత ప్రధానమంత్రి
* ఇలాంటి హింసాయుత ఘటనలకు అమెరికాలో చోటు లేదు. పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రచారంలో జరిగిన కాల్పుల ఘటనపై నాకు సమాచారం వచ్చింది. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసిన తర్వాత మనసు కుదుటపడింది. ఆయన్ను కాపాడిన సీక్రెట్ సర్వీస్‌కు ధన్యవాదాలు. ఆయన కుటుంబ సభ్యులు, ర్యాలీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా.
జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
అమెరికా ప్రముఖులపై దాడులు కొత్త కాదు!
- ఇప్పటి వరకు నలుగురు ప్రెసిడెంట్లు..
- మొదటి అధ్యక్షుడు అబ్రహం లింకన్‌తో మొదలు..
- ప్రాణాలు సైతం కోల్పోయిన నేతలు
- ట్రంప్ మీద దాడితో ఉలిక్కిపాటు
వాషింగ్టన్, జూలై 14: అమెరికాలో వాక్ స్వాతంత్య్రంతో పాటు దాడులు చేసే సంస్కృతి కూడా ఎక్కువే. ఇప్పుడు ఏకంగా అధ్య క్ష అభ్యర్థి మీదే దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమయింది. ఇటువంటి దాడులు అ మెరికాలో కొత్తేం కాదు.. ఈ రాజకీయ దాడుల్లో అనేక మంది నేతలు ప్రాణాలు కూడా కోల్పోయారు. అగ్రరాజ్యంలో ఇది వ రకు జరిగిన దాడులపై ఓ లుక్కేస్తే..
ఇప్పటి వరకు నలుగురు ప్రెసిడెంట్లు..
ఇప్పటి వరకు నలుగురు ప్రెసిడెంట్లు దుం డగుల తూటాలకు బలయ్యా రు. అగ్రరాజ్యం లో ఇటువంటి ఘటనలు జరగడం అందరినీ కలవరపాటుకు గురి చేసింది.
మొదటి అధ్యక్షుడు అబ్రహం లింకన్‌తో మొదలు..
అమెరికా మొదటి అధ్యక్షుడిగా సేవలందించిన అబ్రహం లింకన్ 18 65లో ఓ దుండగుడి చేతిలో కాల్పులకు గురయ్యి ప్రాణాలు విడిచారు. వాషింగ్టన్‌లో ఉన్న ఫోర్డ్స్ అనే థియేటర్‌కు వెళ్లినపుడు కాల్పులు జరిపారు. జాన్ వైక్స్ బూత్ అనే దుండగుడు లింకన్‌ను పొట్టన పెట్టుకు న్నాడు. తర్వాత ఆ దుండగుడిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
జేమ్స్ గార్ఫీల్డ్
అమెరికా అధ్యక్షుడిగా చార్జ్ తీసుకున్న ఆరు నెలలకే గార్ఫీల్డ్‌ను దుండగులు కాల్చి చంపారు. చార్లెస్ అనే దుండగుడు గార్ఫీల్డ్‌ను చంపగా.. అతడిని ఏడాదిలోనే ఉరి తీశారు.
విలియం మెక్‌కిన్లే..
1901లో విలియం మెక్‌కిన్లేను దుండగులు కాల్చిచంపారు. సామాన్యులతో మెక్‌కిన్లే సంభాషణ జరుపుతుండగా.. ఇది జరిగింది. ఆయన రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది జరిగింది.
జాన్. ఎఫ్. కెనడీ
జాన్ ఎఫ్ కెనడీ మీద ఓ స్నైపర్ (షార్ప్ షూటర్) కాల్పులు జరిపాడు. ఆయన్ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించినా లాభం లేకుండా పోయింది.
అతడి తమ్ముడు కూడా:జాన్.ఎఫ్. కెనడీ సోదరుడు రాబర్ట్ ఎఫ్. కెనడీని కూడా దుండగులు కాల్చి చంపారు. చనిపోయే సమయంలో కెనడీ న్యూయార్క్ సెనెటర్‌గా ఉన్నారు. అతడు 1968 ప్రెసిడెంట్ ఎన్నికలకు పోటీలో ఉన్న సమయంలో ఇది జరిగింది.
దాడులకు గురైన మరికొంత మంది అమెరికా నేతలు..
- రొనాల్డ్ రీగన్,
- గెరాల్డ్ ఫోర్డ్,
- రూజ్‌వెల్ట్,
- జార్జ్ సీ వాల్లెస్,
- జార్జ్ బుష్,
- బిల్ క్లింటన్