calender_icon.png 7 February, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజదొంగ బత్తుల ప్రభాకర్ కేసులో షాకింగ్ ట్విస్ట్

07-02-2025 12:02:59 AM

  1. తెర వెనుక అంతా తానై నడిపించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రంజిత్
  2. పోలీసుల అదుపులో రంజిత్.. కీలక విషయాలు వెలుగులోకి
  3. ఆయుధాల కొనుగోలులో కీలక సూత్రధారి అన్షు కోసం గాలింపు

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 06 (విజయక్రాంతి): తీగ లాగితే డొంక కదిలినట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ విషయంలో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకాలం అతనికి ఆశ్రయం ఇవ్వడం నుంచి ఆర్థిక లావాదేవీలు వరకు ఎవరు సహాయం చేశారన్న విషయాలు ఒక్కొక్కటిగా బయట  వస్తున్నాయి.

ప్రిజం పబ్ వద్ద పోలీ  కాల్పుల జరిపిన మోస్ట్ వాంటెడ్ బత్తు  ప్రభాకర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గత శనివారం ప్రిజం పబ్బు వద్ద ప్రభాకర్‌ను స్కోడా కారులో డ్రాప్ చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రంజిత్‌ను గురువారం గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో బత్తుల ప్రభాకర్‌కు సంబంధించి పలు కీలక విషయాలు రాబట్టారు.

2023 నుంచే ప్రభాకర్‌తో రం  సన్నిహితంగా మెలుగుతున్నట్లు గుర్తించారు. ప్రభాకర్‌కు ఆశ్రయం కల్పించడంతో పాటు బ్యాంక్ లావాదేవీల వరకు రంజిత్ అంతా చూసుకునేవాడని విచారణలో తే  ఇక ప్రభాకర్ బీహార్‌లో ఆయుధాలు కొనుగోలు చేయడం నుంచి వాటిని తరలించడంలో రంజిత్ కీలకంగా వ్యహరిం ప్రభాకర్‌తో కలిసి చోరీ చేసిన డబ్బులను కూడా రంజిత్ తన బ్యాంకు ఖాతాలో వే  వ్యవహారాలన్నీ చక్కబెట్టేవాడని ఇక ఆర్థిక లావాదేవీలన్నీ రంజిత్ అకౌంట్స్ నుంచే జరిగేవని వెల్లడించారు.

దీంతో ఈ కేసులో రంజిత్‌ను ఏ2గా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రభాకర్, రంజి  సహకరించిన మరో మిత్రుడు రవి ప్ర  పరారీలో ఉన్నాడు. ఆయుధాల కొనుగోలులో కీలక సూత్రధారిగా ఉన్న బీహార్‌కు చెందిన అన్షు కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అలాగే గజదొంగ బత్తుల ప్రభాకర్‌తో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే దానితో పాటు ఎక్కడెక్కడ తిరిగాడు అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.