‘మహానటి’తో టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. ఆ సినిమాలో తన నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం పొందిందీ చిన్నది. ఆ విజయం ఆమెను అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గానూ మార్చేసింది. ఇన్నాళ్లూ నటనా ప్రాధాన్యమున్న చిత్రాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చిన ఈ భామ మెల్లగా అందాలను ఆరబోసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ‘రఘుతాత’ సినిమా ప్రమోషన్స్‌లో బ్యాక్‌లెస్ టాప్, అందమైన చీరకట్టుతో హాజరైన సందర్భంలో తాను ఇకపై గ్లామర్ డోస్ పెంచుతున్నట్టు చెప్పకనే చెప్పిందంటూ తమ అభిమాన హీరోయిన్ గురించి కుర్రకారు మాట్లాడుకోవటం చూస్తుంటే నిజమేననిపిస్తోంది.
ఇటీవల ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ డిఫరెంట్ డ్రెస్సుల్లో గ్లామరస్‌గా కనిపించింది. తాజాగా హైదరా బాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన కీర్తి మీడియాతో ఓ ఆసక్తికరమైన విషయం చెప్పింది. ‘ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక వ్యక్తి చేసిన పనిని ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను ఎంతగానో అభిమా నించే ఒక వ్యక్తి డైరెక్ట్‌గా మా ఇంటికి వచ్చాడు. మా ఇంటి తలుపు తట్టి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అతని తీరుతో నేను ఒక్కసారిగా షాక య్యా’ అని తెలిపింది. అందాల పరదాలను తీసేస్తూ కీర్తి కిరీటాలు పొందాలనుకునే ప్రయత్నంలో ప్రేమ, పెళ్లి లాంటి ప్రపోజల్స్ తప్పవు కదా కీర్తమ్మా!