calender_icon.png 15 January, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతిమ్ పంగల్‌కు షాక్

09-08-2024 02:37:32 AM

పారిస్: భారత రెజ్లర్ అంతిమ్ పంగల్‌కు ఊహించని షాక్ తగిలింది. నిబంధనలు అతిక్రమించిన కారణంగా అంతిమ్ పంగల్ అక్రిడిటేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ఒలింపిక్ కమిటీ పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల ఫ్రీస్టుల్ 53 కేజీల విభాగంలో పోటీ పడిన అంతిమ్ పంగ్ క్వార్టర్స్‌కే పరిమితమైంది. క్వార్టర్స్‌లో తుర్కియే రెజ్లర్ యెట్‌గిల్ చేతిలో పరాజయం చవిచూసింది. అనంతరం ఆమె తన కోచ్‌లు భగత్ సింగ్, వికాస్ ఉంటున్న హోటల్‌కు వెళ్లింది. తన వస్తువులు కొన్ని క్రీడా గ్రామంలో ఉన్నట్లు సోదరి నిశాకు చెప్పి అక్రిడిటేషన్ కార్డును ఇచ్చింది.

నిశా ఒలింపిక్ విలేజ్‌కు వెళ్లి వస్తువులను తీసుకొస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొన్నారు. అనంతరం అక్రిడిటేషన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు అంతిమ్‌పై చర్యలకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో అంతిమ్ పంగల్‌ను పిలిచి విచారణ జరిపారు. అక్రిడిటేషన్ దుర్వినియోగం అయినట్లు భావించిన ఒలింపిక్ నిర్వాహకులు.. దానిని రద్దు చేశారు. ఒకవేళ అంతిమ్ తప్పు చేసినట్లు తేలితే మూడేళ్ల నిషేధం పడే అవకాశముంది.