calender_icon.png 20 April, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుబాయ్‌లో తెలంగాణవాసుల హత్యపై దిగ్భ్రాంతి

16-04-2025 02:01:09 AM

ఘటనపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఆరా

హైదరాబాద్, ఏప్రిల్  15 (విజయక్రాంతి): బతుకుదెరువుకు దుబాయ్ వెళ్లిన ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్ హత్యకు గురయ్యారని తెలుసుకున్న కేంద్ర మం త్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, ఇదే ఘ టనలో మరో ఇద్దరు తెలుగువారు గాయపడినట్లు తెలిసిందన్నా రు.

ఇద్దరు మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువ చ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశామని వివరించారు. ప్రేమ్‌సాగర్ స్వస్థలం నిర్మల్ జిల్లాలోని సోన్ మండల కేంద్రమని, శ్రీనివాస్ స్వస్థలం నిజామా బాద్ అని తేలిందని వెల్లడించా రు.

మృతుల కుటుంబాలకు అండ గా ఉంటామని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తానని హా మీ ఇచ్చారు. మరోవైపు ప్రేమ్‌సాగర్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని బాధిత కుటుంబ సభ్యులు బీజేఎల్పీ నేత ఏలేటి కోరారు.