calender_icon.png 30 October, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌కు గ్రేటర్ ఎమ్మెల్యేల షాక్

06-07-2024 01:45:54 AM

సమావేశానికి డుమ్మా కొట్టిన 8 మంది ఎమ్మెల్యేలు

17 మంది కార్పొరేటర్లు సైతం దూరం

వీరంతా పార్టీ మారే అవకాశముందంటూ ప్రచారం

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్నటివరకు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పగా తాజా గా ఒకే దఫాలో ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీని వీడి కేసీఆర్ షాక్ ఇచ్చారు. దీంతో పార్టీలో అమోమయం నెలకొంది. పార్టీలో కొనసాగేవారెవరో, దూరమయ్యే వారెవరో ఎవరికీ అంతుచిక్కడం లేదు. గత రాత్రి ఎమ్మెల్సీల జంపింగ్ వ్యవహారం పార్టీలో సంచలంగా మారింది.

శుక్రవారం తెలంగాణ భవన్‌లో హైకమాండ్ నిర్వహించిన గ్రేటర్ బీఆర్‌ఎస్ నేతల సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేలు, 17 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టడంతో వీరంతా త్వరలో పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోం ది. చేరికలు ఇంతటితో ఆగలేదని త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతో చేతులు కలపడం ఖాయమని కాం గ్రెస్ నేతలు వెల్లడిస్తున్న తరుణంలో గులా బీ అధిష్ఠానం ఆహ్వానించిన సమావేశానికి సొంత ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చకు దారితీస్తోం ది. దీంతో కారు పార్టీలో ఏం జరుగుతుం దో తెలియక కింది స్థాయి కార్యకర్తలు డైలామాలో పడినట్లు తెలుస్తోంది.

శనివారం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి రాజీనామా కోసం పట్టుబట్టాలని అధిష్ఠానం భావిస్తోంది. ఇందులో భాగంగా కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యుహాల పై చర్చించేందుకు తెలంగాణ భవన్‌కు రావాలని గ్రేటర్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల కు పార్టీ పెద్దలు సమాచారం అందించారు. అధిష్ఠానం పిలుపు వచ్చినప్పటికీ అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి హాజరుకాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అలాగే బీఆర్‌ఎస్‌కు 47 మంది కార్పొరేటర్లు ఉండగా కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. నిజానికి సమావేశానికి కేటీఆర్ నేతృత్యం వహిస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ విషయంలో సీనియర్ న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు. దీంతో తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి పద్మారావు, సుధీర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపినాథ్, ముఠా గోపాల్ హాజరైయ్యారు. గ్రేటర్ పార్టీ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలు మాత్రం తాము వ్యక్తిగత పనులతో హాజ రు కాలేకపోయామని, తాము పార్టీ వీడే ప్రసక్తిలేదని, కొందరు చేసే అసత్య ప్రచా రం నమ్మవద్దని పేర్కొంటున్నారు.