- నవ్వారో చేతిలో గాఫ్ ఓటమి
- క్వార్టర్స్‌కు సబలెంకా, జెంగ్
- జ్వెరెవ్, టియాఫో ముందంజ
ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలనాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పురుషుల విభాగంలో అల్కారాజ్, జొకోవిచ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తాజాగా మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ ప్రిక్వార్టర్స్‌లో ఇంటిదారి పట్టింది. రెండో ర్యాంకర్ అరీనా సబలెంకాతో పాటు ఏడో సీడ్ జెంగ్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌లో జ్వెరెవ్, టియాఫోలు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ ప్రిక్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. సోమవారం మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో గాఫ్ (అమెరికా) 3 6 3 తేడాతో సహచర క్రీడాకారిణి ఎమ్మా నవ్వారో (అమెరికా) చేతిలో ఓడిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన గాఫ్‌ను ఓడిస్తానని మ్యాచ్‌కు ముందు పేర్కొన్న నవ్వారో అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేసింది. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన మ్యాచ్ లో గాఫ్ మీద ఎమ్మా పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
మ్యాచ్‌లో గాఫ్ 19 డబుల్ ఫాల్ట్స్ చేయ డంతో పాటు 60 అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. ఇక పారిస్ ఒలింపిక్స్‌లో వెకిక్‌ను ఓడించి స్వర్ణం నెగ్గిన చైనా టాప్ సీడ్ జెంగ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో జెంగ్ 7 (7 4 6 తేడాతో మళ్లీ వెకిక్ (క్రొయేషియా) నే ఓడించడం విశేషం. 2023 యూఎస్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన రెండో ర్యాంకర్ సబ లెంకా సాఫీగా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. నాలుగో రౌండ్‌లో సబలెంకా (బెలారస్) 6 6 తేడాతో మెర్టెన్స్ (బెల్జియం) మీద సునాయస విజయం నమో దు చేసుకుంది. మరో ప్రిక్వార్టర్స్‌లో బడోసా.. వాంగ్‌పై విజయం సాధించింది.
జ్వెరెవ్ జోరు..
పురుషుల విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) తన జోరును కొనసాగిస్తూ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. నాలుగో రౌండ్‌లో జ్వెరెవ్ 3 6 6 6 తేడాతో నకశిమా (అమెరికా)పై విజయం సాధించాడు. తొలి సెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేసిన జ్వెరెవ్ విజయాన్ని అందుకున్నాడు. జొకోవిచ్‌ను ఓడించిన ఆసీస్ సంచలనం పాపిరిన్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది.
నాలుగో రౌండ్‌లో అమెరికాకు చెందిన టియాఫో 6 7 (7/3), 2 6 పాపిరన్‌పై విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో రుబ్లేవ్‌పై దిమిత్రోవ్, కాస్పర్ రూడ్ పై టేలర్ ఫ్రిట్జ్ విజయాలు సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ఇక డబుల్స్‌లో భారత స్టార్ రోహన్ బోపన్న పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో బోపన్నఎబ్డెన్ ద్వయం అర్జెంటీనా జోడీ గొంజాలెజ్ చేతిలో పరాజయం చవిచూసింది. ఇక మిక్సడ్ డబుల్స్ బరిలో మాత్రమే మిగిలిన బోపన్న తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.