calender_icon.png 27 October, 2024 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాంపియన్‌కు షాక్

03-07-2024 01:27:26 AM

ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో రెండోరోజు పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ మార్కెట వొండ్రుసోవా తొలి రౌండ్‌లోనే ఇంటి బాటపట్టింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న వొండ్రుసోవాకు.. 83వ స్థానంలో ఉన్న స్పెయిన్ యువ ప్లేయర్ జెస్సిక బౌజస్ మనైరో షాక్ ఇచ్చింది. నిరుడు అప్రతిహత విజయాలతో చాంపియన్‌గా నిలిచిన వొండ్రుసోవా.. ఈసారి తొలి రౌండ్‌లో వరుస సెట్లలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 1994 తర్వాత మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ తొలి రౌండ్‌లో వెనుదిరగడం ఇదే తొలిసారి. పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ శుభారంభం చేయగా.. భారత యువ ప్లేయర్ సుమిత్ నాగల్‌కు తొలి రౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. 

లండన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ మార్కెట వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మంగళవారం ఆరోసీడ్ వొండ్రుసోవా 4 2  జెస్సిక బౌజస్ మనైరో (స్పెయిన్) చేతిలో ఓటమి పాలైంది. నిరుడు వింబుల్డన్ ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సెంటర్ కోర్ట్‌లో టైటిల్ చేజిక్కించుకున్న వొండ్రుసోవా ఈ సారి తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది.

వింబుల్డన్‌లో 1994 తర్వాత డిఫెండింగ్ చాంపియన్ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించడం ఇదే మొదటిసారి. 1994లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన స్టెఫీ గ్రాఫ్ ఇలాగే తొలి రౌండ్‌లోనే ఇంటిబాట పట్టింది. నిరుడు అన్‌సీడెడ్‌గా బరిలోకిదిగి గ్రాస్‌కోర్టు గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన తొలి మహిళగా సంచలనం సృష్టించిన వొండ్రుసోవా.. ఈ సారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. గంటకు పైగా సాగిన తొలి రౌండ్‌లో 4 ఏస్‌లు కొట్టిన వొండ్రుసోవా.. 7 డబుల్ ఫాల్ట్స్‌తో ముల్యం చెల్లించుకుంది. రెండు ఏస్‌లకే పరిమితమైన జెస్సిక 14న అనవసర తప్పిదాలు మాత్రమే చేసి 61 పాయింట్లు గెలిచి వరుస సెట్లలో విజయం సాధించింది.

ఇతర మ్యాచ్‌ల్లో ఒస్టపెంకా (లాత్వియా) 6 6 టామ్ జనోవిక్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించగా.. నాలుగోసీడ్ రైబాకినా (కజకిస్థాన్) 6 6 ఎలెనా గాబ్రియల్ (రొమేనియా)పై గెలిచింది. ఐదోసీడ్ జెస్సికా పెగులా (అమెరికా) 6 6 తన దేశానికే చెందిన అష్లే క్రూగెర్‌ను చిత్తుచేసి ముందంజ వేసింది. 

జొకో బోణీ

పురుషుల సింగిల్స్‌లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి చరిత్ర సృష్టించిన సెర్బియన్ వీరుడు నొవాక్ జొకోవిచ్.. సిల్వర్ జూబ్లీ జర్నీ స్టార్ చేశాడు. ఓపెన్ ఎరాలో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో మార్గరెట్ కోర్ట్ (24)తో కలిసి అగ్రస్థానంలో ఉన్న జొకోవిచ్.. గాయం కారణంగా ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే నెల రోజుల వ్యవధిలో తిరిగి కోలుకున్న జొకోవిచ్.. ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ తొలి పోరులో మంగళవారం రెండో సీడ్ జొకోవిచ్ 6 6 6 విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై అలవోకగా విజయం సాధించాడు.

మ్యాచ్‌లో 10 ఏస్‌లు కొట్టిన జొకో.. రెండు డబుల్ ఫాల్ట్స్‌చేయగా.. 4 ఏస్‌లకే పరిమితమైన కొప్రివా 5 డబుల్ ఫాల్ట్స్ చేశాడు. 32 విన్నర్లు కొట్టిన జొకో 16 అనవసర తప్పిదాలు చేయగా.. 30 అనవసర తప్పిదాలు చేసిన కొప్రివా.. 25 విన్నర్లకే పరిమితమై పరాజయం మూటగట్టుకున్నా డు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సిన్నెర్ (ఇటలీ) 6 6 3 6 హాన్ఫ్‌మన్ (జర్మనీ)పై, నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6 6 6 కార్బల్స్ బయినా (స్పెయిన్)పై, హుర్కాజ్ (పోలాండ్) 5 6 6 6 అల్బొట్ (మొల్డొవా)పై విజయాలు సాధించారు.

సింగిల్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన ఏకైక భారత ఆటగాడు సుమిత్ నాగల్ తొలి రౌండ్‌లో 2 6 3 4 కెకమనోవిక్ (సెర్బియా) చేతిలో పరాజ యం పాలయ్యాడు.