న్యూఢిల్లీ: అడిలైడ్ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత స్టార్ శ్రీరామ్ బాలాజీ జోడీ ప్రి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మెక్సికోకు చెందిన రెయిస్‌తో జత కట్టిన శ్రీరామ్ 4 6 10 భారత్‌కే చెందిన డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న బరియెంటోస్ (కొలంబియా) జంటపై విజయం సాధించింది. మాథ్యూ ఎబ్డెన్‌తో ఇటీవలే తెగదెంపులు చేసుకున్న బోపన్న బరియెంటోస్‌తో జత కట్టిన తొలి టోర్నీలోనే పరాజయం పాలవ్వడం గమనార్హం. మరోవైపు ఏఎస్‌బీ క్లాసిక్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు సుమిత్ నాగల్ పోరాటం ముగిసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో నాగల్ 7 (10/8), 4 2 మిచెల్‌సన్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు.