calender_icon.png 17 January, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంగారూలకు ఝలక్

03-08-2024 01:58:30 AM

  1. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
  2. రెండో స్థానంతో క్వార్టర్స్‌కు హర్మన్ సేన

పారిస్: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం పూల్‌ఏ భారత్ 3 తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (ఆట 13వ నిమిషంలో, 32వ ని.లో), అభిషేక్ (12వ ని.లో) గోల్స్ సాధించగా.. ఆస్ట్రేలియా తరఫున టామ్ క్రెయిగ్ (25వ ని.లో), బ్లేక్ గోవర్స్ (55వ ని.లో) రెండు గోల్స్ చేశారు. కాగా ఒలింపిక్స్ చరిత్రలో 1972 తర్వాత ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం ఇదే తొలిసారి. తొలి క్వార్టర్స్‌లోనే భారత్ రెండు గోల్స్ సాధించి ప్రత్యర్థిని హడలెత్తించింది.  ఆ తర్వాత ఆసీస్ ఒక గోల్ సాధించి ఆధిక్యాన్ని తగ్గించింది.

ఈ దశలో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ సహా భారత డిఫెండర్లు ఆస్ట్రేలియా అటాకింగ్ గేమ్‌ను సమర్థంగా అడ్డుకోవడంలో విజయవంతమయ్యారు. ఈసారి ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యమని పేర్కొన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో కనీసం గోల్ చేస్తూ వచ్చిన హర్మన్ ఆసీస్‌తో మ్యాచ్‌లోనూ రెండు గోల్స్‌తో మెరిసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

భారత్ తరఫున ఆఖరి టోర్నీ ఆడుతున్న గోల్ కీపర్ శ్రీజేష్ తన అనుభవంతో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. గ్రూప్ దశలో భారత్ మూడు విజయాలు, ఒక డ్రా, మరో ఓటమితో 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. పూల్  నుంచి భారత్‌తో పాటు బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనాలు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఆదివారం క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి.