న్యూఢిల్లీ: 2026లో జరగనున్న యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో షూటింగ్, హాకీని తొలగిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఐవోసీ నిర్ణయం భారత్‌కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. వెయిట్‌లిఫ్టింగ్‌ను కూడా ఎత్తేసే యోచనలో ఉంది. 2018 యూత్ ఒలింపిక్స్ గేమ్స్‌లో భారత్ 13 పతకాలు గెలుచుకుంటే అందులో షూటింగ్ నుంచి 4, హాకీ నుంచి రెండు, వెయిట్‌లిఫ్టింగ్ నుంచి ఒక స్వర్ణం వచ్చింది. 2026 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 13 వరకు సెనెగల్‌లో యూత్ ఒలింపిక్స్ జరగనున్నాయి.