calender_icon.png 30 March, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఎమ్మెల్యేకు షాక్..

27-03-2025 12:18:51 AM

ఆరేళ్ల పాటు సస్పెండ్

ముక్కుసూటిగా మాట్లాడినందుకు రివార్డిది

బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన గౌడ పాటిల్ యత్నాళ్‌పై వేటు పడింది. ఆయన్ను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కేంద్ర క్రమశిక్షణ కమిటీ లేఖ రాసింది. బీజేపీపై అలాగే మాజీ సీఎం యడియూరప్పకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆయనకు కేంద్ర క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి 10న నోటీసులు జారీ చేసింది. ఇక తాజాగా ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సస్పెన్షన్‌పై బసనగౌడ స్పందించారు.

‘వారసత్వ రాజకీయాలు, అవినీతి వ్యతిరేక వ్యాఖ్యలు, పలువురి ఆధిపత్యం, ఉత్తర కర్ణాటక అభివృద్ధి చేయాలని అడిగినందుకు నన్ను పార్టీ నుంచి వెలివేశారు. ముక్కు సూటిగా మాట్లాడినందుకు నాకు పార్టీ ఇచ్చిన రివార్డు ఇది. నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.