లాహోర్: పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజంను ఇంగ్లండ్‌తో రాబోయే రెండు టెస్టులకు దూరం పెడుతూ.. సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. బాబర్ ఆజంతో పాటు సీనియర్లు షాహిన్, నసీం, సర్ఫరాజ్ లాంటి ప్లేయర్లకు సెలెక్టర్లు మొండి చేయి చూపెట్టారు. ఎన్నో రోజుల పాటు వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన బాబర్ గత కొద్ది రోజులుగా సరైన ప్రదర్శన చేయడం లేదు.
ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో కూడా బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్ మీద కూడా బాబర్ పరుగులు చేయలేకపోయాడు. ఇటీవలే బాబర్ ఆజం పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. రేపటి నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.