calender_icon.png 7 January, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీరాముని పల్లకి శోభాయాత్ర

05-01-2025 11:27:27 PM

భారీగా తరలివచ్చిన అశేష భక్త జనం...

పాల్గొన్న మఠాధిపతి.. ఎమ్మెల్యే..

శ్రీరామ నామస్మరణతో మార్మోగిన పట్టణ పురవీధులు...  

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శ్రీరామ పల్లకి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ మఠాధిపతి శ్రీ కృష్ణ జ్యోతి సరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాగంకి వేలాదిగా జనం తరలివస్తున్నారు. ఆదివారం నిర్వహించిన శ్రీరామ పల్లకి శోభయాత్రలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. శోభ యాత్రకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా భక్తజనం తరలివచ్చారు. ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో శ్రీరాముని నామస్మరణతో పట్టణ పురవీధులన్ని మారుమ్రోగాయి. చిన్న, పెద్ద, పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భజన సంకీర్తనలను ఆలపిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి భావాన్ని చాటుకున్నారు. శోభాయాత్ర సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.