26-02-2025 08:35:05 PM
ఘనంగా శివరాత్రి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు..
పెద్దపల్లి (విజయక్రాంతి): మహాశివరాత్రి పురస్కరించుకొని బుధవారం పెద్దపల్లి జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివరాత్రి పండుగకు జిల్లాలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రముఖ శివ క్షేత్రాలైన ఆలయంలో శివ కళ్యాణం నిర్వహించగా భక్తులు తండోపతండాలుగా తరలివెళ్లారు. రామగుండంలోని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం జనగామ శివ ఆలయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వీరికి ఆలయ ప్రధాన అర్చకుడు అర్చన చేశారు. మంథని పట్టణంలోని గౌతమేశ్వరాలయంలోని గోదావరి నదిలో గోదావరి స్నానం పుణ్య స్నానాలు చేసే శివున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంథనిలో గోదావరి స్నానం చేసేందుకు వస్తున్న భక్తులకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అల్పాహారం ఏర్పాటు చేయగా మంత్రి సోదరుడు దుదిళ్ల శ్రీనుబాబు పాల్గొని భక్తులకు అల్పాహారం అందించారు.