calender_icon.png 26 November, 2024 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వణికించిన వాన

17-05-2024 01:40:42 AM

హెడరాబాద్!

ఈదురుగాలులతో దంచికొట్టిన వర్షం

కొట్టుకుపోయిన నాలాల పైకప్పులు

చెరువులైన రోడ్లు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగులుపడి ఇద్దరు వ్యక్తులు మృతి

మరో రెండు రోజులు అకాల వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం అకాల వర్షం కురిసి అతలాకుతలం చేసింది. జనజీవనాన్ని స్తంభింపజేసింది. హైదరాబాద్ మహానగరంలో ఈదురుగాలులతో వర్షం తీవ్రత ఎక్కువగా కనిపించింది. సుమారు రెండు గంటలపాటు కుండపోత వర్షం కురిసి డ్రైనేజీలు ఉప్పొంగాయి. నాలాలపై కప్పులు కూలిపోయాయి. ప్రధానమార్గాల్లో మోకాలు లోతులో వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వరద పారడంతో పలుచోట్ల మ్యాన్‌హోల్స్ మూతలు కొట్టుకుపోయాయి. దీంతో ఒకచోట ద్విచక్రవాహనం, మరోచోట కారు కొట్టుకుపోయాయి. రోడ్లపై వృక్షాలు నేలకొరగడం, వర్షపు నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. నలుగురు గాయాలపాలయ్యారు. అలాగే పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.