28-02-2025 12:46:55 AM
కుమ్రం భీం అసిఫాబాద్, ఫిబ్రవరి 27(విజయ క్రాంతి): మహాశివరాత్రి పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శివ క్షేత్రాలలో రెండు రోజులపాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరిగాయి. గురువారం రెబ్బెన మండలం శివాలయం, కాగజ్ నగర్ మండలం ఇస్గాం శివాలయం వద్ద భక్తులు బోనాలు పోసి శివ మల్లన్న దేవుడికి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్షను విరమించారు.
జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్ శివాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన వితరణ చేపట్టారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని శివాలయంలో ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాంకిడి మండల కేంద్రంలోని శివకేశవ ఆలయంలో బిజెపి నేత అరిగెల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు చేపట్టారు. జిల్లాలో రెండు రోజులపాటు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన జాతర ఉత్సవాలు ముగిశాయి.