06-03-2025 12:00:00 AM
రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘ఆర్‌సీ 16’ రూపొందుతున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. గత నవంబర్‌లో మైసూర్‌లో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ మధ్యే టీమ్ హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసింది. అయితే, ఈ సినిమాలో కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారంటూ కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి.
ఆ వార్తల్ని నిజం చేస్తూ మేకర్స్ బుధవారం అధికారిక ప్రకటన చేశారు. తాజాగా చిత్రబృం దం శివరాజ్‌కుమార్ లుక్ టెస్ట్‌ను పూర్తిచేసింది. ఇక త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండే శివన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్నారు. జగపతిబాబు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: రత్నవేలు.