calender_icon.png 23 April, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ‘శివాణి’ సత్తా

23-04-2025 01:10:47 AM

హనుమకొండ, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): 2025 ఇంటర్మీడియట్ ఫలితాల్లో హనుమకొండలోని శివాణి జూనియర్ కాలేజీ విద్యార్థినిలు విశ్వరూపం చూపారు. రాష్ట్రస్థాయి ర్యాంకులను కైవసం చేసుకుని మరోసారి ఇంటర్మీడియట్ ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు.

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అన్ని గ్రూపుల్లో ప్రతిభ చాటి తమకెవరు సాటి లేరని నిరూపించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో నేరెళ్ల రిషిత 468/470, నాగుల నవదీప్ 468/470,  లకుంట్ల చక్రిక 468/470 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.

అలాగే నూతెంకి జస్వంత్, బోయిని వరుణ్ తేజ్, తోడేటి శివకుమార్, నల్లపు తేజశ్రీ, బండి పూజిత, బక్క సంధ్య 467/470 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. బైపీసీ విభాగంలో భానోత్ స్వాతి 435/440, మేకల ఇంద్రజ 434/440 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఇక సిఈసి విభాగంలో మేకల కార్తీక్ 484/500 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.

ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కూడా శివాణీ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఎంపీసీ విభాగంలో చీర్ల శైజ 995/1000, కంచన కుంట్ల మాధవి 995/1000, బోనగిరి మనీష 993/1000, రాసూరి నక్షత్ర 993/1000, కంచ దివ్యశ్రీ 992/1000, కంకణాల శరన్ రోజా 992/1000, పోరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి 991/1000, పూజారి జెమిని 990/1000 ఉత్తీర్ణత సాధించారు. అలాగే బైపిసి విభాగంలో ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఆరే హాసిని 993/1000, గుండ హన్సిక 992/1000, మోడు సుస్మిత 992/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో శివాని పేరును చాటారు.

అత్యున్నత మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను శివాని జూనియర్ కళాశాల యాజమాన్యం, కరస్పాండెంట్ టీ,స్వామి, ప్రిన్సిపాళ్ళు జి.సురేందర్, రెడ్డి, వి.చంద్రమోహన్, డైరెక్టర్లు టి.రాజు, ఎన్, రమేష్, ఏ.మురళీధర్, వి. సురేష్, ఎస్.సంతోష్ రెడ్డి అభినందించారు. తమ విజయానికి కారకులైన విద్యార్థులు అధ్యాపకులు తల్లిదండ్రులు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.