20-02-2025 12:00:00 AM
ఆనంది.. ప్రస్తుతం ‘గరివిడి లక్ష్మి’ చిత్రంలో నటిస్తోంది. ఓ బుర్ర కథ కళాకారిణి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆనంది టైటిల్ రోల్‌లో నటిస్తోంది. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటోందీ చిత్రం. ఇదిలా ఉండగా, తాజాగా ఆనందికి సంబం ధించి మరో కొత్త సినిమా వార్త వచ్చింది.
ఆమె ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతోంది. ‘శివంగి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం బుధవారం సాయంత్రం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆనంది అదిరిపోయే ఫోజులో ఆకట్టుకుంటోంది. నుదిటన విబూది నామాలు దిద్దుకొని, నల్లని కళ్లద్దాలు ధరించి, సోఫాలో దర్జాగా కూర్చొని ఉన్న ఆనంది లుక్ అమితంగా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాకు దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నరేశ్ బాబు పీ నిర్మాత. ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచుకుంటూ శివంగి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.