calender_icon.png 24 October, 2024 | 5:46 PM

ఆగస్టు 1న శివం భజే

13-07-2024 04:30:58 AM

అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘శివం భజే’. అశ్విన్ బాబు సూర్యవంశీ హీరోహీయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీశర్మ, తనికెళ్ల భరణి, సాయి దీన, అయ్యప్ప శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్‌రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని ఆయన శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. “ నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ‘శివం భజే’ చిత్రాన్ని ఆగస్టు 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నాం. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తాం” అని తెలిపారు.