హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జక్కడి శివచరణ్‌రెడ్డి అధ్యక్షుడిగా విజయం సాధించినట్టు ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్‌భాను చిబ్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ఉదయ్‌భాను చిబ్, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ, యుత్ కాంగ్రెస్ జాతీయ ఇంచార్జి కృష్ణ అల్లవరును జక్కిడి శివచరణ్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకపత్రాన్ని శివచరణ్ రెడ్డికి అందజేశారు.