26-02-2025 06:51:58 PM
భక్తుల సందడితో కిటకిటలాడిన శివాలయాలు..
శివుడి విగ్రహాలకు పూజలు చేసిన ఎమ్మెల్యే ముఠాగోపాల్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు శివాలయాలు భక్తుల శివనామ స్మరణలతో మార్మోగాయి. నియోజకవర్గంలోని కవాడిగూడ, భోలక్పూర్, గాంధీనగర్, అడిక్మెట్, రాంనగర్ డివిజన్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు చేరుకొని శివుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. భోలక్పూర్ లోని శ్రీ భవాని శంకర దేవాలయం, ముషీరాబాద్ లోని శివాలయం రామ్ నగర్ లోని రామాలయం, గాంధీ నగర్ లోని శ్రీ లలితా పరమేశ్వరి దేవాలయంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహాలు హాజరై శివుడి విగ్రహాలకు అభిషేకాలు, అర్చణలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ... మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడికి అభిషేకాలు చేస్తే మంచి జరుగుతుందని అన్నారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఒక్కరూ భక్తిని అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్లోని బీఆర్ఎస్ నాయకులు వై.శ్రీనివాసరావు వల్ల శ్యామ్ యాదవ్, ఎం రాకేష్ కుమార్, శంకర్ ముదిరాజ్, కొండా శ్రీధర్ రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, శివాలయం టెంపుల్ చైర్మన్ శ్రీధర్ చారి, భవాని శంకర్ దేవాలయం చైర్మన్ ఆర్. శ్రీనివాస్, నాయకులు రవి యాదవ్, ముఠా నరేష్ ఎర్రం శ్రీనివాస్ గుప్త, శివ ముదిరాజ్, సాయి చాణక్య రెడ్డి, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, జి. వెంకటేష్, రాజకుమార్ రవిశంకర్ గుప్తా, కిరణ్ కుమార్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్, కుమారస్వామి, రచ్చ సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.