* పోలీసుల సహకారంతో తాళాలు తొలగించిన వారణాసి ప్రజలు
న్యూఢిల్లీ, జనవరి 9: వారణా సిలో 100ఏళ్ల త ర్వాత శివాలయం తలుపు లు తెరుచుకున్నా యి. వారణాసిలోని ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతంలో గత వందేళ్లకుపైగా సిద్ధేశ్వర మహదేవ్ మూసే ఉంది. పోలీసులు, జిల్లా అధికారుల సహకారంతో ఆ ఆలయం తలుపులను స్థానికులు గురువారం తెరిచారు.
మూసి ఉన్న సిద్ధేశ్వర ఆలయాన్ని తిరిగి తెరిపించాలని గత నెలలో సనాతన్ రక్షక దళం అధికారులను కోరారు. అలాగే అక్కడ మత పరమైన ఆచారాలకు అనుమతి ఇవ్వాలని విన్నవిం చారు. దీంతో ఆలయాన్ని తెరవడానికి అధికారులు అంగీకరించారు. ఈ క్రమంలోనే గ్యాస్ కట్టర్ సహాయంతో ఆలయ తాళాలను స్థానికులు తొలగించారు.
దీనిపై సనాతన రక్షక దళం రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ శర్మ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. కాశీ వాసుల కృషి వల్ల ఆయల తలుపులు తెరుచుకున్నాయన్నారు. సంప్రదాయం ప్రకారం ఆలయంలో దెబ్బతిన్న మూడు శివలింగాలను పునఃప్రతిష్టించనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.