calender_icon.png 18 January, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక సందేశంతో శివ శంభో

18-01-2025 12:00:00 AM

తనికెళ్ల భరణి, సుమన్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘శివ శంభో’. కృష్ణ ఇస్లావత్, కేశవర్థిని హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ సినిమాలో బేబీ రిషిత కీలక పాత్ర పోషించింది. నర్సింగ్ దర్శకత్వంలో అనంత ఆర్ట్స్ పతాకంపై రాజగోపాల్, దోరవేటి సుగుణ నిర్మించారు. ఈ సినిమా పోస్టర్‌ను గీత రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలుగు సాహిత్యం, సంస్కృతితోపాటు అన్ని హంగులతో ఈ సినిమా ఉన్నట్టు తెలుస్తోంది’ అన్నారు.

‘ఈ సినిమాను మహా శివరాత్రికి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని డైరెక్టర్ నర్సింగ్ తెలిపారు. ఈ సినిమాకు మాటలు, పాటలు రాసిన దోరవేటి మాట్లాడుతూ.. ‘నేటి సమాజానికి డబ్బు, సుఖాలు, సౌకర్యాలకు కొరత లేదు. మనశ్శాంతి లేక కొట్టుకుంటున్నారు. పరమ శివుని నమ్ముకుంటేనే శాంతి దొరుకుతుందనే సందేశంతో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్న ఆశిస్తున్నాను’ అన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నటీనటులు వేణు, బేబీ రిషిత, ఎన్ రమేశ్ యాదవ్, అమరేంద్ర, కో ప్రొడ్యూసర్ శ్రీశైలంరెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, టెక్నీషియన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.