30-03-2025 12:00:00 AM
సంగీత, సాహిత్య విలువలతో భక్తి ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘శివశంభో’. అనంత ఆర్ట్స్ పతాకంపై బొజ్జ రాజగోపాల్, సుగుణ దోరవేటి, శ్రీశైలంరెడ్డి నిర్మించారు. కృష్ణ ఇస్లావత్, కేశవర్ధిని హీరోహీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు నర్సింగ్‌రావు దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భర ణి, సుమన్, టార్జాన్, విజయ్ రం గరాజన్, చిల్లర వేణు, రామస్వా మి, రజాక్, మల్లేశ్, రవిరెడ్డి, రమేశ్‌యాదవ్, శ్రీకర్, విఘ్నేశ్, బేబీ రిషిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డీవోపీగా కారె సతీశ్‌కు మార్ పనిచేస్తుండగా.. మాటలు, పాటలు, సంగీతం దోరవేటి చెన్న య్య అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్‌తో అనౌన్స్ చేయించింది చిత్రబృం దం. ఆయన ప్రకటించిన మేరకు ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడు తూ.. ‘భారతీయ కళలైన సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా రూపొందించిన సందేశా త్మక చిత్రం ఇది. ఇలాంటి సినిమాలను అభిరుచి గల ప్రేక్షకులు తప్ప క ఆదరిస్తారు’ అన్నారు. చిత్ర నిర్మాత, రచయిత, సంగీత దర్శకుడు దోరవేటితోపాటు మరో నిర్మాత బొజ్జ రాజగోపాల్, నటు లు రమేశ్, బేబీ రిషిత మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.