21-04-2025 07:17:55 PM
నిజాంసాగర్(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో నిర్మితమైన అభయాంజనేయ క్షేత్రం 3వ వార్షికోత్సవంలో భాగంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ దంపతులు కళ్యాణ మహోత్సవం నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఎఎంసీ ఛైర్మెన్ చీకోటి మనోజ్ కుమార్, ఎలే మల్లికార్జున్, భాస్కర్ రెడ్డి, ప్రజా పండరి, అశోక్ రెడ్డి, వెంకట్రాం రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.