బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం(Bugga Sri Bugga Rajarajeshwara Swamy Temple)లో సోమవారం ఆలయ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు శ్రీరాంభట్ల వేణుగోపాల శాస్త్రి, సతీష్ లు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని శ్రీ కోదండ రామాలయం, భక్త మార్కండేయ ఆలయం, శ్రీ వాసవి మాత ఆలయాలనుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి శివపార్వతుల కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని కన్నుల పండుగ వీక్షించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య పార్వతి అమ్మవారికి తోడు తెచ్చుకున్న ఒడిబియ్యాన్ని పోసి వైభవంగా వైభవంగా తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.నియోజకవర్గం లోని ఏడు మండలాల నుండి పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడంతో బుగ్గ శివాలయానికి ఆధ్యాత్మిక శోభ చేకూరింది.