calender_icon.png 2 October, 2024 | 5:25 AM

శివునీ ముద్దుల గుమ్మ

02-10-2024 02:17:28 AM

 విజయక్రాంతి నెట్‌వర్క్ : తంగేడూ.. గూనుగు, ముత్యాలు, మందారం, బంతి, చేమంతి వంటి తీరొక్క పూలతో బొడ్డెమ్మలు బతుకుమ్మలు ఎత్తుకున్నారు. ‘చిత్తు చిత్తుల బొమ్మ.. శివునీ ముద్దుల గుమ్మ’ అంటూ ఆడిపాడారు. రాష్ట్రప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లో యాజమాన్యాలు ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

వేడుకల్లో భాగంగా ఆయా విద్యాసంస్థల ఆవరణలో బతుకమ్మలు పేర్చి ఆడారు. దీంతో ఆయా ప్రాంగణాలన్నీ సందడిగా మారాయి. యాద్రాద్రి భువనగిరి పట్టణంలోని జీనియస్ విద్యాలయంతో పాటు బీబీనగర్, ఆలేరు, చౌటుప్పల్ కేంద్రాల్లోని పలు విద్యాసంస్థల్లో ఈ సంబురాలు జరిగాయి. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మెదక్, రంగారెడ్డి జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లోనూ వేడుకలు ఘనంగా జరిగాయి.