11-02-2025 06:33:26 PM
దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని కర్నాల్ పల్లి గ్రామంలో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా ఆలయంలో తొలి వార్షిక వేడుకల్లో పాల్గొన్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డీ, వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వాహకుడు రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో, గణపతి పూజ, స్వస్తి వాచనం, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ట, మహా లింగార్చన, మంగళ హారతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు మసాయి పేట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, గ్రామ అధ్యక్షులు లింగం, మాజీ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్, సండ్రుగు శ్రీకాంత్, సాయికుమార్ గౌడ్, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.