జాతీయస్థాయి ఆర్చరీలో బంగారు, వెండి పతకాలు
ఆదిలాబాద్, జూలై 24 (విజయక్రాంతి): చెన్నైలో జరుగుతున్న జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో ఆదిలాబాద్ గిరిజన విద్యార్థులు మెరిశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్ ప్రభుత ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని పెందూర్ రూప బంగారు పతకం, 7వ తరగతి విద్యార్థిని శ్రీజ రజత పతకం కైవసం చేసుకున్నారు. ఇండియన్ ఆర్చరీ రౌండ్ 30 మీటర్ల విభాగంలో రూప మొదటి స్థానంలో నిలవగా, 20 మీటర్ల విభాగంలో శ్రీజ రెండో స్థానంలో నిలిచారు. పతకాలు సాధించిన విద్యార్థునులనుఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, డీడీ దిలీప్‌కుమార్, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, డీవైఎస్‌వో వెంకటేశర్లు, అర్చరీ సంఘం కార్యదరి బుక్యా రమేశ్, కోచ్ కాత్లె మారుతి, పీడీ రవీందర్, హెచ్‌ఎం అరుణకుమారి అభినందించారు.