calender_icon.png 18 January, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరిసిన దివ్య

17-09-2024 12:27:41 AM

బుడాపెస్ట్: 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు దూసుకెళ్తున్నారు. సోమవారం భారత మహిళల జట్టు ఆరో రౌండ్‌లో ఆర్మేనియాతో తలపడింది. తెల్ల పావులతో బరిలోకి దిగిన భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ 1 ఎలీనాపై 40వ ఎత్తులో విజయం సాధించింది. మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక.. లిలిత్‌తో గేమ్‌ను 44వ ఎత్తు వద్ద డ్రాగా ముగించుకుంది. ఇక పురుషుల జట్టు హంగేరీతో ఆడింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి.. సనన్‌తో గేమ్‌ను 40వ ఎత్తు వద్ద డ్రా చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన భారత్ 10 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతోంది.